డిసప్పాయింట్​ చేసిన BRO మూవీ హీరోయిన్

డిసప్పాయింట్​ చేసిన BRO మూవీ హీరోయిన్

కుర్రాళ్ల కలల సుందరి కేతిక శర్మ(Ketika Sharma) మరోసారి ఉసూరుమనిపించింది. పవన్​ కల్యాణ్​, సాయిధరమ్​ తేజ్​ కలిసి నటించిన ‘బ్రో’ సినిమాలో ఈ బ్యూటీ నటించింది. కనీసం ఈ సినిమా అయినా కేతికకు కలిసి వస్తుందని ఆమె ఫ్యాన్స్​ గంపెడన్ని ఆశలు పెట్టుకున్నారు. అయితే, ఇందులో ఈ హీరోయిన్​ రోల్​కి పెద్దగా ప్రాధాన్యం లేదు. ఇక ఎప్పటిలాగే గ్లామర్​ డాల్​గా పాత్రకే పరిమితమైంది. 

మూవీ ప్రమోషన్స్​లో సందడి చేసినా మూవీలో ఆమె రోల్ ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంది. ‘రొమాంటిక్’​ సినిమాతో హీరోయిన్​గా పరిచయమైన కేతిక ఇప్పటివరకు ఒక్క హిట్​ను కూడా అందుకోలేకపోయింది. 

ఇటీవల వచ్చిన రంగరంగ వైభవంగా కూడా డిజాస్టర్​గా మారింది. మోడల్​గా,యూట్యూబర్​గా, సింగర్​గా కేతిక పాపులర్. కానీ, ఆమె ట్యాలెంట్​ చూపించే అవకాశాలు మాత్రం రావడం లేదని ఫ్యాన్స్​ వాపోతున్నారు.