రివ్యూ: బ్రోచేవారెవరురా?
రన్ టైమ్: 2 గంటల 21 నిమిషాలు
నటీనటులు: శ్రీ విష్ణు,నివేతా థామస్,సత్యదేవ్,నివేతా పేతురాజ్,రాహుల్ రామకృష్ణ,ప్రియదర్శి,బిత్తిరి సత్తి,శ్రీకాంత్ అయ్యర్,శివాజీ రాజా,హర్షవర్థన్ తదితరులు.
సంగీతం : వివేక్ సాగర్
ఛాయాగ్రహణం : సాయి శ్రీరామ్
ఎడిటింగ్ : రవితేజ గిరజాల
నిర్మాత : విజయ్ కుమార్ మన్యం
రచన – దర్శకత్వం : వివేక్ ఆత్రేయ
రిలీజ్ డేట్: జూన్ 28,2019
కథేంటి.
అప్ కమింగ్ డైరెక్టర్ అయిన విశాల్ (సత్యదేవ్) హీరోయిన్ షాలిని (నివేతా పేతురాజ్) కు స్టోరీ నరేట్ చేస్తుంటాడు.మరో పక్క ఓ ఊళ్లో తనకు ఇష్టంలేకుండా మిత్రా (నివేత థామస్) అనే అమ్మాయికు తన తండ్రి (శ్రీకాంత్ అయ్యర్) కాలేజ్ లో బలవంతంగా చేర్పిస్తాడు. అదే కాలేజ్ లో ముగ్గురు యువకులు (శ్రీ విష్ణు,ప్రియదర్శి,రాహుల్ రామకృష్ణ) ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తారు..వాళ్లు తనను కావాలనే కిడ్నాప్ చేయించి వాళ్ల నాన్నను బెదిరించి ఆ డబ్బులు ఆ అమ్మాయికిచ్చి హైదరాబాద్ పంపిస్తారు. ఆ డైరెక్టర్ కథ,ఈ కథ ప్యారలల్ గా జరుగుతుంది.ఓ దశలో ఈ రెండు కథల లింక్ కనెక్టవుతుంది.ఆ రెండింటికి లింక్ ఏంటి..చివరకు ఎలాంటి టర్న్ తీసుకున్నాయి అనేది కథ.
నటీనటుల పర్ఫార్మెన్స్ :
ఆల్రేడీ తనేంటో ప్రూవ్ చేసుకున్న హీరో శ్రీ విష్ణు మరోసారి ఈ మూవీలో మంచి పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు.నివేతా థామస్ కు మంచి రోల్ దక్కంది.తను మిత్రా రోల్ కు పూర్తి న్యాయం చేసింది.సత్యదేవ్ మంచి నటుడని తెలుసు.తనకు మంచి క్యారెక్టర్ దొరికింది.ఆ పాత్రలో ఒదిగిపోయాడు.సపోర్టింగ్ రోల్స్ లో రాహుల్ రామకృష్ణ,ప్రియదర్శి లు బాగా ఎంటర్ టైన్ చేశారు.శ్రీకాంత్ అయ్యర్,అజయ్ ఘోష్,హర్ష వర్థన్ లు కూడా బాగా చేశారు.
టెక్నికల్ వర్క్:
సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ నీట్ గా ఉంది.మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ మేజర్ రోల్ పోషించాడని చెప్పాలి.వినసొంపమైన బాణీలతో పాటు..బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సీన్లను ఎలివేట్ చేశాడు.ఎడిటింగ్ బాగుంది.వివేక్ ఆత్రేయ రాసుకున్న సంభాషణలు చాలా న్యాచురల్ గా ఉన్నాయి..
విశ్లేషణ:
‘‘బ్రోచేవారెవరురా’’ ఫన్ గా,ఎంగేజింగ్ గా సాగే కిడ్నాప్ డ్రామా..సింపుల్ స్టోరీ తో డైరెక్టర్ వివేక్ ఆత్రేయ అల్లుకున్న కథనం అబ్బురపరుస్తుంది.టోటల్ క్రెడిట్ అతనికే ఇవ్వాలి.. పేపర్ మీద పెట్టిన ప్రతీ దానిని బాగా ఎక్స్ క్యూట్ చేసుకున్నాడు..ఫస్ట్ సీన్ నుండే ఈ సినిమాపై మంచి ఇంప్రెషన్ కలుగుతుంది..అలా ప్రతీ సీన్ ను సరదాగా నరేట్ చేసుకుంటూ,చిన్న చిన్న ట్విస్టులతో కథ పై ఆసక్తి కలిగేలా చేశాడు డైరెక్టర్.ఇంటర్వెల్ ట్విస్టుతో ఒక్కసారిగా షాకిస్తాడు.మళ్లీ ఆ తర్వాత సెకండాఫ్ లో కూడా పట్టు సడలని కథనంతో సినిమాను పరుగులు పెట్టించాడు.దానికి కారణం డైరెక్టర్ రాసుకున్న పకడ్బందీ స్క్రీన్ ప్లే నే. ప్రతీ క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉంది.నటీనటుల నుండి టెక్నీషియన్ల నుండి డైరెక్టర్ మంచి ఔట్ పుట్ తీసుకోగలిగాడు.ఇంటర్వెల్ వరకు నరేట్ చేసిన విధానానికి,ఆ తర్వాత వచ్చే ట్విస్టుకు మధ్య ఇంటర్ లింక్ చేయడం ద్వారా దర్శకుడి ప్రతిభ ఏంటో చెప్పొచ్చు.సెకండాఫ్ కాస్త డ్రాగ్ అయినట్టు అనిపించినా..క్లైమాక్స్ టైట్ గా ప్రజెంట్ చేసి మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.ఓవరాల్ గా ఈ సినిమా చూస్తున్నంత సేపు మంచి ఎక్స్ పీరియన్స్ కలుగుతుంది.ఎంటర్ టైన్మెంట్ యే కాకుండా మంచి కథ ,ట్విస్టులు ఆసక్తి రేకెత్తిస్తాయి.. పెట్టిన డబ్బులకు న్యాయం జరుగుతుంది.