IPO News: సంచలనం సృష్టించటానికి వస్తున్న ఐపీవో.. టార్గెట్ రూ.58 వేల కోట్లు, గెట్ రెడీ

IPO News: సంచలనం సృష్టించటానికి వస్తున్న ఐపీవో.. టార్గెట్ రూ.58 వేల కోట్లు, గెట్ రెడీ

Groww IPO: గడచిన కొన్ని వారాలుగా దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ఐపీవోల రాక క్రమంగా తగ్గిపోయాయి. దీనికి కారణం మార్కెట్లు కరెక్షన్ మోడ్ ద్వారా తిరోగమనాన్ని చూడటమే. అయితే ఇలాంటి ప్రతికూల వాతావరణంలో కంపెనీలు తమ ఐపీవోలను ఫ్లోట్ చేటయానికి ఇష్టపడవని మనందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం మంచిరోజులు తిరిగి వచ్చాయని చెప్పుకోవచ్చు. దీంతో ఐపీవోలపై బెట్టింగ్ వేసేందుకు ఇన్వెస్టర్లు తిరిగి డబ్బు సిద్ధం చేసుకుంటున్నారు. 

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది స్టాక్ మార్కెట్లలో బ్రోకరేజ్ సేవలను అందిస్తున్న ప్రముఖ ఫ్లాట్ ఫారమ్ గ్రోవ్ గురించే. వాస్తవానికి గడచిన కొన్ని త్రైమాసికాలుగా ఎక్కువ మంది యూజర్లను ఆకర్షిస్తూ ఈ సంస్థ జెరోధాను యూజర్ల పరంగా వెనక్కి నెట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కంపెనీ తన ఐపీవోను దేశీయ మార్కెట్లలోకి తీసుకురావాలని చూస్తోంది. తాజా ఐపీవో ద్వారా రూ.58వేల కోట్లను సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఈ క్రమంలోనే కంపెనీ తన కార్యకలాపాలను అమెరికా నుంచి ఇండియాకు మార్చుకుందని వెల్లడైంది. 

వాస్తవానికి కంపెనీ తన కార్యకలాపాలను మరింతగా బలోపేతం చేసేందుకు అవసరమైన నిధులను సమీకరించటానికి టైగర్ గ్లోబల్ సంస్థతో ఇప్పటికే చర్చలు ప్రారంభించిందని వెల్లడైంది. ఈ రౌండ్ ద్వారా దాదాపు రూ.1660 కోట్లను సమీకరించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ ప్రస్తుతం మార్కెట్ విలువ దాదాపు రూ.54 వేల కోట్లుగా అంచనా వేయబడింది. .

ALSO READ : వారం రోజులుగా లాభాల్లో స్టాక్ మార్కెట్.. మెయిన్ రీజన్ ఏంటంటే..

ఇక కంపెనీ వ్యాపారం విషయానికి వస్తే దాదాపు 9 ఏళ్ల కిందట ప్రారంభించబడిన కంపెనీని లలిత్ కేషారే, హర్ష్ జైన్, ఇషాన్ బన్సాల్, నీరజ్ సింగ్ సంయుక్తంగా ప్రారంభించారు. వాస్తవానికి తొలినాళ్లలో కంపెనీ కేవలం ఒక మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాన్ని మాత్రమే  చేపట్టింది. ఆ తర్వాత బ్రోకరేజ్ సేవల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంస్థ ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద ఆటగాళ్లలో ఒకటిగా గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ మెగా ఐపీవో మార్కెట్లో కొత్త ప్రకంపనలకు దారితీయవచ్చని తెలుస్తోంది. ఫుల్ టైం బ్రోకరేజ్ సేవలను మరింతగా తాజా నిధులను ఉపయోగించి బలోపేతం చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. 

NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.