Market Crash: కొత్త నెల కుప్పకూలనున్న స్టాక్ మార్కెట్లు..! ఇన్వెస్టర్స్ జర అలర్ట్..

Market Crash: కొత్త నెల కుప్పకూలనున్న స్టాక్ మార్కెట్లు..! ఇన్వెస్టర్స్ జర అలర్ట్..

Markets Correction: నేడు రంజాన్ కారణంగా భారతీయ స్టాక్ మార్కెట్లు సెలవులో ఉన్నాయి. దీంతో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు పూర్తిగా తమ సేవలను నేడు నిలిపివేయటంతో వరుసగా మూడో రోజు కూడా మార్కెట్లు క్లోజ్ అయ్యాయి. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు కొత్త నెల తమ ప్రయాణాన్ని ప్రారంభించటం కోసం ఎదురుచూస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి నిఫ్టీ సూచీ తన గరిష్ఠ స్థాయి నుంచి దాదాపు 11 శాతం పతనాన్ని చూడగా సెన్సెక్స్ కూడా భారీగానే దెబ్బతింది.

లిబరేషన్ డే దగ్గరపడటంతో అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన వాణిజ్య పన్నుల అమలుకు రంగం సిద్ధం అవుతోంది. దీంతో ఇండియాపే ప్రకటించబడే సుంకాలపైనే అందరి దృష్టి కొనసాగుతోంది. ఇటీవల మార్కెట్లలో కరెక్షన బలహీనమైన భారత ఆర్థికాభివృద్ధి డేటా, నిరాశపరిచిన కార్పొరేట్ ఆదాయాలు, ఎఫ్ఐఐల అమెరికా, చైనా మార్కెట్లలో మంచి అవకాశాలను చూస్తూ మన మార్కెట్లను నిష్క్రమించటం వల్ల ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం మరోసారి ఏప్రిల్ 2 నుంచి ట్రంప్ పన్నుల ప్రకటన భయాలు దేశీయ మార్కెట్లలో భయాలను కలిగిస్తున్నాయి. దీంతో ఈసారి రెండో విడత మార్కెట్ల కరెక్షన్ ఉంటుందా అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. 

ట్రంప్ భారత్ పై భారీగా సుంకాల ప్రకటించే అవకాశం ఉండటంతో మార్కెట్ల పతనం ఏర్పడవచ్చని జేఎం ఫైనాన్షియల్ పేర్కొంది. దీనికి అనుగుణంగా అమెరికా మార్కెట్ సూచీలు కూడా 1-2 శాతం మధ్య కరెక్షన్ చూశాయి. ఇతర దేశాలు అమెరికా వస్తువులపై వేస్తున్న పన్నులకు అనుగుణంగా ట్రంప్ టారిఫ్స్ ఉండొచ్చని ఇది దేశాలను బట్టి మారుతుంటుందని నోమురా పేర్కొంది. 

Also Read :- అమెరికా అంటేనే భయమేస్తోంది

అమెరికా నుంచి వచ్చే దిగుమతులపై భారత్ 9.5 శాతం సుంకం విధిస్తుండగా.. అమెరికా ఇండియా నుంచి వచ్చే వస్తువులపై 3 శాతం సుంకం మాత్రమే విధిస్తున్నట్లయితే.. పరస్పర సుంకం 6.5 శాతం అవుతుందని నోమురా పేర్కొంది. టారిఫ్స్ యుద్ధంలో భారత్, థాయిలాండ్, బ్రెజిల్ ప్రభావితం కానున్న టాప్-5 దేశాల జాబితాలో ఉన్నట్లు బ్రోకరేజ్ పేర్కొంది. ఎఫ్‌పీఐ ప్రవాహాల ట్రెండ్ ప్రధానంగా ఏప్రిల్ 2న ట్రంప్ అంచనా వేసిన పరస్పర సుంకాలపై ఆధారపడి ఉంటుందని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వికె విజయకుమార్ అన్నారు. యూఎస్ ప్రకటించిన టారిఫ్స్ తీవ్రంగా లేకపోతే భారత ఈక్విటీ మార్కెట్లలో ర్యాలీ కొనసాగవచ్చని అభిప్రాయపడ్డారు.

దిగుమతి చేసుకున్న కార్లు, ఆటో కాంపోనెంట్‌పై 25 శాతం దిగుమతి సుంకాన్ని ఇప్పటికే అమెరికా ప్రకటించింది. ఈ సుంకాలు ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వస్తాయని CLSA తెలిపింది. దీని కారణంగా టాటా మోటార్స్, భారత్ ఫోర్జ్ సంవర్ధన మదర్సన్ వంటి కంపెనీలు ప్రభావితం కానున్నాయి. ఇప్పటికే టాటాలకు చెందిన జాగ్వార్ లాండ్ రోవర్ అమ్మకాల్లో 31 శాతం అమెరికా నుంచి వస్తున్న నేపథ్యంలో టాటాలపై పెద్ద ప్రభావం ఉంచొచ్చు. అయితే ప్రస్తుతం ఇవి యూకేలో తయారవుతున్న సంగతి తెలిసిందే.