Stock to Buy: 100% లాభం ఇవ్వనున్న స్టాక్.. రూపాయికి రూపాయి లాభం పక్కా..!

Stock to Buy:  100% లాభం ఇవ్వనున్న స్టాక్.. రూపాయికి రూపాయి లాభం పక్కా..!

UPL Stock:  ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లలో పెన్నీ స్టాక్స్ నుంచి స్మాల్ క్యాప్ స్టాక్స్ వరకు వివిధ కేటగిరీకి చెందిన షేర్లలో రాబడిని ఇవ్వగల మంచి స్టాక్స్ కోసం వేట కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇన్వెస్టర్ల ముందుగా ఒక అద్భుతమైన స్టాక్ మంచి పనితీరును కనబరచటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది యూపీఎల్ లిమిటెడ్ కంపెనీ షేర్ల గురించే. వాస్తవానికి ఈ స్టాక్ 2025 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మార్కెట్ల క్షీణత ఉన్నప్పటికీ అత్యుత్తమ పనితీరును కనబరిచింది. అలాగే నిఫ్టీ-500 సూచీలో అత్యుత్తమ ప్రదర్శనను అందించి రికార్డుల మోత మోగిస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు స్టాక్ దాదాపు 30 శాతానికి పైగా రాబడిని తన పెట్టుబడిదారులకు ఇప్పటి వరకు అందించింది. నేడు ఇంట్రాడేలో మధ్యాహ్నం 3 గంటలకు కంపెనీ షేర్ల ధరను గమనిస్తే ఒక్కోటి రూ.651 వద్ద ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇది కంపెనీ 52 వారాల గరిష్ఠ ధరకు అత్యంత చేరువగా ఉంది. నవంబర్ 2024లో స్టాక్ దాని 52వారాల కనిష్ఠ ధర రూ.483కి దిగజారిన సంగతి తెలిసిందే.

2025లో కంపెనీ యాజమాన్యం తన మార్గదర్శకత్వాన్ని కొనసాగించటంతో తిరిగి కోలుకుంది. పన్ను తర్వాత ఆదాయ వృద్ధి వార్షిక ప్రాతిపతికన 4-8 శాతం మధ్య ఉంటుందని కంపెనీ భావించటం ఇన్వెస్టర్లలో కొత్త ఆశలకు ఊపిరిపోస్తోంది. అగ్రి కెమికల్స్ రంగంలో ఉన్న కంపెనీ డీలర్లు పూర్తిగా స్టాక్ క్లియర్ చేయటం నమ్మకాన్ని బలపరిచింది. దీంతో కంపెనీ ఆదాయాలు, మార్జిన్లు మెరుగ్గా ఉండవచ్చని నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. స్టాక్ వేగంగా తన రికవరీ జర్నీని కొనసాగిస్తున్నప్పటికీ జూన్ 2021లోని గరిష్ఠం రూ.829 కంటే తక్కువగానే ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. 

ALSO READ | April 1st Rules: కొత్త నెల నుంచి మారిపోతున్న రూల్స్ ఇవే.. జేబులకు చిల్లు..

బ్రోకరేజీలు ఏమంటున్నాయంటే..?
ఈ క్రమంలో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఇన్వెస్టెక్ యూపీఎల్ లిమిటెడ్ కంపెనీ షేర్లకు గతంలో అందించిన SELL రేటింగ్ సవరిస్తూ ప్రస్తుతం BUYకి అప్ గ్రేడ్ చేసింది. ఈ క్రమంలో స్టాక్ టార్గెట్  ధరను రూ.700కి పెంచింది. అలాగే మార్చి 15న ఇన్‌క్రెడ్ UPLపై తన టార్గెట్ ధరను రూ.754 నుండి రూ.1,289కి పెంచింది. అంటే ప్రస్తుతం మార్కెట్లో స్టాక్ ట్రేడ్ అవుతున్న ధరకు దాదాపుగా 100 శాతం పెరుగుదలను ఇది సూచిస్తోంది. అలాగే షేర్లను కొనుగోలు చేయెుచ్చని కూడా సూచిస్తూ యాడ్ రేటింగ్ ఇచ్చింది. 

ప్రపంచ వ్యాప్తంగా పంట రక్షణకు వినియోగించే కెమికల్స్ వ్యాపారం తిరిగి పుంజుకోవటంతో బ్రోకరేజీలు సైతం ఈ కేటగిరీలోని అనేక కంపెనీల షేర్లపై తమ గత రేటింగ్ లను అప్ గ్రేడ్ చేస్తూ ముందుకు సాగుతున్నాయి.  ప్రస్తుతం యూపీఎల్ కంపెనీ షేర్లను దాదాపు 24 మంది విశ్లేషకులు ట్రాక్ చేస్తుండగా వారిలో 16 మంది కంపెనీ షేర్లకు BUY  రేటింగ్ అందిస్తున్నారు. ఇక ఇందులో ఏడుగురు హోల్డ్ రేటింగ్ ఇస్తుండగా కేవలం ఒక్కరు మాత్రమే కంపెనీ  షేర్లను విక్రయించాలని సూచిస్తున్నారు. 

NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.