షూటర్ సురభికి బ్రాంజ్ మెడల్‌‌

షూటర్ సురభికి బ్రాంజ్ మెడల్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: నేషనల్ గేమ్స్‌‌లో తెలంగాణకు రెండో పతకం లభించింది. షూటర్ సురభి భరద్వాజ్‌‌ కాంస్య పతకం గెలిచింది. సోమవారం జరిగిన విమెన్స్ 50 మీటర్ల రైఫిల్ 3పొజిషన్స్‌‌ ఈవెంట్‌‌లో సురభి 488.8 స్కోరుతో మూడో స్థానంలో నిలిచి పతకం అందుకుంది. 

ఇండియా స్టార్ షూటర్‌‌‌‌, పంజాబ్‌‌కు చెందిన సిఫ్ట్ కౌర్‌‌ సమ్రా‌‌ 461.2 స్కోరుతో గోల్డ్ అందుకుంది. అదే రాష్ట్రానికి చెందిన సీనియర్ షూటర్‌‌‌‌ అంజుమ్ మౌద్గిల్‌‌ 458.7 స్కోరుతో సిల్వర్ గెలిచింది. మరోవైపు బాస్కెట్‌‌ బాల్‌‌ 3x3 విమెన్స్‌‌ ఈవెంట్‌‌లో తెలంగాణ విమెన్స్‌‌ టీమ్‌‌ ఫైనల్ చేరుకొని పతకం ఖాయం చేసుకుంది. మెన్స్ బాస్కెట్‌‌బాల్‌‌ టీమ్ కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది.