
అమెరికాలో దారుణం జరిగింది.ఓ వ్యక్తి తన బంధువులైన నలుగురు బాలికల గొంతుకోశాడు. తీవ్రగాయాలతో బాలికలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మటన్ కొట్టే కత్తితో బాలికల గొంతు కోసినట్లు పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలంలోని నిందితుడిని పోలీసులు కాల్చి చంపారు. నిందితుడి మానసిక స్థితి సరిగ్గా లేదని తెలుస్తోంది. అమెరికాలోని బ్రూక్లిన్లోని బ్లడీ అపార్టుమెంట్లో ఈ ఘటన ఆదివారం(ఏప్రిల్6) ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
The @NYPDPC and NYPD executives provided an update on an ongoing investigation in Brooklyn:https://t.co/qw6kVCGLGt
— NYPD NEWS (@NYPDnews) April 6, 2025
ఆదివారం ఉదయం బ్రూక్లిన్‌లోని ఓ ఇంట్లో జరిగిన హింసాత్మక దాడిలో 8నుంచి16 యేళ్ల వయస్సు గల నలుగురు బాలికలు తీవ్రంగా గాయపడ్డారు. పిల్లలతో బంధువు అని భావిస్తున్న లాంగ్‌కియాన్ చెన్ (49) అనే వ్యక్తి ఆ బాలికలపై మాంసం కట్ చేసే కత్తితో దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు.
Also Read : అమెరికాలో తట్టు వ్యాధి విజృంభణ
11 ఏళ్ల బాలిక 911 కు కాల్ చేయడంతో న్యూయార్క్ పోలీసులు సంఘటనా స్థాలానికి చేరుకున్నారు. నిందితునిపై కాల్పులు జరిపారు. ఆ బాలిక ఒక గదిలో దాక్కుని అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. నలుగురు పిల్లలకు తీవ్ర గాయాలు అయ్యాయి.ప్రస్తుతం ప్రాణాపాయం ఏమీ లేనట్లుగా పోలీసులు తెలిపారు.
ఈ దాడి వెనుక గల ఉద్దేశ్యం ఇంకా స్పష్టంగా తెలియలేదు. నిందితుడి మానసిక అనారోగ్య స్థితిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఏదైనా గృహ హింస ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.