గండిపేట, వెలుగు : అక్క, తమ్ముడు అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదర్‌గూడలోని కేశవనగర్ కాలనీలో ఉంటున్న చామంతి (26), సోమయ్య దంపతులకు ఇద్దరు పిల్లలు. చామంతికి వరుసకు తమ్ముడయ్యే శేఖర్(25) వీరి ఇంటిపైనే రెంట్‌కు ఉంటున్నాడు.
మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని టైమ్‌లో చామంతి, శేఖర్ ఉరేసుకున్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. డెడ్‌బాడీలను ఉస్మానియాకు తరలించారు. చామంతి, శేఖర్ ఆత్మహత్యకు కారణాలు తెలియదని.. వివరాలు
సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.