తిరుపతిలో జంట హత్యలు కలకలం రేపుతోంది. చనిపోయిన ఇద్దరు మహారాష్ట్ర నాంధేడుకు చెందిన అన్నా చెల్లెల్లు మనీషా, హర్షవర్దన్ గా గుర్తించారు అలిపిరి పోలీసులు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అన్నాచెల్లెను చంపింది వాళ్ల బావ యువరాజ్ గా గుర్తించారు.
ALSO READ : గవర్నర్ను అడ్డుపెట్టుకొని నీచ రాజకీయాలు : మంత్రి హరీశ్ రావు
12 ఏళ్ల క్రితం యువరాజ్ కు మనిషాకు పెళ్ళి అయింది. వీరికి ఇద్దరు పిల్లలు షక్షమ్(6), ప్రజ్ఞాన్ (4) ఉన్నారు. యువరాజ్, మనీషాలతో పాటు ఆమె సోదరుడు హర్షవర్ధన్ తిరుపతికి వెళ్లారు. కపిల తీర్థం దగ్గరలోని ఓ హోటల్‌లో రూం తీసుకున్నారు. ఏమైందో ఏమో తెల్వదు కానీ యువరాజ్.. మనీషాతోపాటూ ఆమె అన్నయ్య హర్షవర్ధన్‌ని కత్తితో నరికి చంపేసినట్లు తెలిసింది.హత్య చేసిన యువరాజ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.