జగన్ ను టార్గెట్ చేసిన బ్రదర్ అనిల్..!

జగన్ ను టార్గెట్ చేసిన బ్రదర్ అనిల్..!

ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకర్త వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ సీఎం జగన్ పై పరోక్షంగా విమర్శలు చేశారు. చిత్తూరు జిల్లా సత్యవేడులోని ఓ చర్చ్ లో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్న ఆయన ప్రజలను ఉంద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏం జరుగుతుందో నాకంటే మీకే బాగా తెలుసనీ, దేవుడు ఉన్నాడని, రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను చూస్తూ ఊరుకోడని అన్నారు. ఈ వ్యాఖ్యలు జగన్ ని ఉద్దేశించినవే అని చెప్పచ్చు. ఇటీవల షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటనపై కూడా అనిల్ స్పందించాడు. తాత్కాలిక ఆనందం కోసం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని అన్నారు.

2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మద్దతుగా క్రిస్టియన్ ఓట్లను కూడగట్టడంలో బ్రదర్ అనిల్ కీలక పాత్ర పోషించాడని టాక్. ఇప్పుడు సీఎం జగన్ తో విభేదించిన తన భార్యకి మద్దతుగా క్రిస్టియన్ ఓట్లను కాంగ్రెస్ కి కన్వర్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఆ ప్లాన్ లో భాగంగానే ఎస్సీ నియోజికవర్గమైన సత్యవేడులో ప్రార్థనల్లో పాల్గొన్నాడని తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా బ్రదర్ అనిల్ పర్యటిస్తాడని టాక్ వినిపిస్తోంది. మరి, గత ఎన్నికల్లో ప్రభావం చూపిన అనిల్ 2024 ఎన్నికల్లో కూడా ప్రభావం చూపుతాడా అన్నది వేచి చూడాలి.