పాల్వంచ రూరల్, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని ఉల్వనూరు గ్రామపంచాయతీ పరిధి పెద్దకలశ, గొత్తికోయ గుంపులో పాత కక్షలతో సొంత బావను ఓ బావమరిది హత్య చేసిన ఘటన ఆదివారం ఆలస్యంగా బయటకొచ్చింది. పాల్వంచ రూరల్ ఎస్ఐ కార్తీక్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకలశ, గొత్తికోయ గుంపునకు చెందిన బడిశా సురేశ్(45) అనే వ్యక్తికి అదే గ్రామానికి చెందిన మొక్కటి జోగా అక్కతో కొన్ని సంవత్సరాల కింద పెళ్లి జరిగింది.
తాగుడుకు బానిసైన సురేశ్ ప్రతీ రోజు భార్యను కొట్టేవాడు. కొద్దిరోజుల కింద ఆమె చనిపోయింది. అయితే తన అక్కను బావ సురేశ్ చంపి ఉంటాడని, జోగా అతడిపై కక్ష పెంచుకున్నాడు. ఈనెల 18న పెద్దకలశ గ్రామం వద్ద సురేశ్‌ను చంపి డెడ్‌బాడీని చిర్దనపాడు వాగు పక్కన పూడ్చిపెట్టాడు. వారం రోజులుగా సురేశ్కనబడకపోవడంతో గంగదేవిపల్లి సర్పంచ్ భర్త మంగయ్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తూ అనుమానంతో జోగాను అదుపులోకి విచారించారు. జోగా తన నేరాన్ని ఒప్పుకున్నాడు. సురేశ్డెడ్బాడీకి అదే స్థలంలో పోస్టుమార్టం చేశారు.