సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన అన్నాచెల్లెలు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. పట్టణానికి చెందిన సమ్మెట విజయ్‌కుమార్ రేణుక ఎల్లమ్మ దంపతులకు కుమారుడు రాహుల్‌గౌడ్, కుమార్తె ఐశ్వర్య ఉన్నారు. విజయ్‌కుమార్ తనకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేస్తూ పాన్ షాపు నడుపుతున్నాడు.
బీటెక్ పూర్తి చేసిన రాహుల్‌గౌడ్, ఐశ్వర్యలు ఇటీవల ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. రాహుల్ పంచాయితీ రాజ్ శాఖలో ఏఈఈగా, ఐశ్వర్య పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో ఏఈఈ ఉద్యోగానికి ఎంపిక కావడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.