చెల్లె పెండ్లికి ..తండ్రి విగ్రహాన్ని చేయించి ఇచ్చిన అన్న

చెల్లె పెండ్లికి ..తండ్రి విగ్రహాన్ని చేయించి ఇచ్చిన అన్న
  • భావోద్వేగానికి గురైన ఫ్యామిలీ మెంబర్స్

వర్ధన్నపేట(ఐనవోలు), వెలుగు: చెల్లె పెండ్లికి తండ్రి లేడన్న వెలితిని తీర్చాడో అన్న. తండ్రి విగ్రహాన్ని చేయించి పెండ్లిలో గిఫ్ట్​ గా అందజేశాడు. దీంతో అక్కడున్నవాళ్లంతా భావోద్వేగానికి గురయ్యారు. హనుమకొండ జిల్లా ఐనవోలుకు చెందిన వడిచెర్ల శ్రీనివాస్​ గత ఏడాది జనవరి 22న చనిపోయాడు. అప్పటి నుంచి కుటుంబ బాధ్యతను అతడి కొడుకు కమల్​హాసన్​ తీసుకున్నాడు.

 ఇటీవల చెల్లె శివాని పెండ్లి కుదరగా.. తండ్రి లేదన్న బాధ ఆమెను వేధించింది. దీంతో తన చెల్లికి తండ్రి లేడన్న వెలితిని తీర్చాలనే ఉద్దేశంతో కమల్​ హాసన్​ దాదాపు రూ.లక్షన్నర ఖర్చు పెట్టి ఎవరికీ తెలియకుండా తన తండ్రి ఫైబర్​ విగ్రహాన్ని చేయించాడు. సోమవారం చెల్లెలు పెండ్లి జరగగా, విగ్రహాన్ని తన తల్లి అనురాధ సమక్షంలో గిఫ్ట్​గా ఇచ్చాడు. తండ్రి విగ్రహాన్ని చూసిన వధువుతో పాటు పెండ్లిలో పాల్గొన్న కుటుంబ సభ్యులు, బంధువులు భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం విగ్రహం వద్ద ఫొటోలు దిగారు.