![మణుగూరులో అప్పులు చేసి పారిపోయిన అన్నదమ్ములు](https://static.v6velugu.com/uploads/2025/02/brothers-abscond-after-defaulting-on-loans-in-manuguru-bhadradri-district_NrSl9FPcRB.jpg)
- 40 మంది వద్ద రూ. 2 కోట్ల వరకు తీసుకున్న వ్యాపారులు
- భద్రాద్రి జిల్లా మణుగూరులో ఘటన
మణుగూరు, వెలుగు : కిరాణ వ్యాపారం చేస్తున్న ఇద్దరు అన్నదమ్ములు గ్రామస్తుల వద్ద భారీ మొత్తంలో అప్పులు తీసుకొని చివరకు పరార్ అయ్యారు. ఈ ఘటన భద్రాద్రికొత్తగూడెం జిల్లా మణుగూరులో వెలుగుచూసింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... మణుగూరు మండలం సమితి సింగారం గ్రామానికి చెందిన గీద రాము, లక్ష్మణరావు అన్నదమ్ములు. వీరు కొన్నేండ్లుగా మణుగూరులో కిరాణ దుకాణం నడపుతున్నారు.
వ్యాపార లావాదేవీల కోసమంటూ పలువురి వద్ద అప్పులు తీసుకున్నారు. కొన్ని రోజుల పాటు వడ్డీ సక్రమంగా చెల్లించిన అన్నదమ్ములు ఆ తర్వాత వడ్డీలు ఇవ్వడం మానేశారు. నాలుగు రోజులుగా షాపులు తీయకుండా, పట్టణంలో కనిపించకుండా పోవడంతో ఏదైనా ఊరికి వెళ్లి ఉంటారని గ్రామస్తులు భావించారు.
కానీ మంగళవారం లీగల్ నోటీసులు అందడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. బాధితులంతా బుధవారం కిరాణం షాపు వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. అన్నదమ్ములు కలిసి పట్టణంలో మొత్తం 40 మంది వద్ద రూ. 2 కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది.