రైతు కుటుంబంలో మెరిసిన విద్యా ఆణిముత్యాలు

రైతు కుటుంబంలో మెరిసిన విద్యా ఆణిముత్యాలు
  •   గ్రూప్ 1,2,3 ఉద్యోగాలు సాధించిన గోవింద్రాల బంజరకు చెందిన అన్నదమ్ములు

కామేపల్లి, వెలుగు : మండలంలోని గోవింద్రాల బంజర గ్రామానికి చెందిన రైతు గంగవరపు సత్యనారాయణ, జ్యోతిర్మయి దంపతులకు కుమారులు సాయి క్రిష్ణమ నాయుడు, రత్నేశ్వర నాయుడు ఇటీవల ప్రకటించిన గ్రూప్ 1, 2, 3 పరీక్ష ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించి తమ తల్లిదండ్రులకు, గ్రామానికి పేరు తీసుకొచ్చారు. పెద్ద కుమారుడు సాయి క్రిష్ణమ నాయుడు గతంలో రంగారెడ్డి జిల్లా హైకోర్టులో చిన్నపాటి ఉద్యోగం సాధించాడు. అనంతరం ఖమ్మం జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం పొందాడు. 

అలా పని చేస్తూనే ఇటీవల జరిగిన గ్రూప్ 1 పరీక్షలో 435 మార్కులు సాధించాడు. గ్రూప్ 2 పరీక్షలో 898 ర్యాంకు పొందాడు. గ్రూప్ 3 పరీక్షలో  రాష్ట్రస్థాయిలో  578 ర్యాంకు  జోన్ స్థాయిలో 67 ర్యాంకు సాధించాడు. చిన్న కుమారుడు రత్నేశ్వర నాయుడు గతంలో హైకోర్టులో  ఉద్యోగం వచ్చినా వెళ్లలేదు. ఖమ్మం కమర్షియల్ టాక్స్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం చేస్తూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు.

 గ్రూప్ 1 పరీక్షలో 467 మార్కులు, గ్రూప్ 2 పరీక్షలో 197 ర్యాంకు,   గ్రూప్ 3 పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 27 ర్యాంకు, జోన్ స్థాయిలో 4వ ర్యాంకు సాధించాడు. వివిధ ఉద్యోగాల కోసం రాసిన ప్రతి పరీక్షలో ఈ అన్నదమ్ములు ఉద్యోగాలు  సాధిస్తూ వచ్చారు. వీరికి గ్రామస్తలు అభినందనలు 
తెలిపారు.