
- సంగారెడ్డి జిల్లాలో ఘటన
కొండాపూర్, వెలుగు: సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం కోనాపూర్ గ్రామంలో భూమి అడిగాడని సొంత తమ్ముడిని అన్న హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బేగరి రవీందర్, బేగరి రాంచందర్(30) అన్నదమ్ములు. వీరి తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో ఇద్దరూ కలిసిమెలిసి ఉండేవారు. అయితే కుటుంబ కలహాలతో రాంచందర్ భార్య విడాకులు తీసుకుని వెళ్లిపోయింది.
అప్పటి నుంచి కూలి పనులు చేసుకుంటూ రామచందర్ తాగుడుకు బానిసయ్యాడు. కాగా రవీందర్‌కు ఎకరా 15 గుంటల భూమి ఉండగా, రాంచందర్‌కు కేవలం 8 గుంటల భూమే ఉంది. ఈ విషయమై తాగిన ప్రతీసారి రామచందర్ అన్న రవీందర్‌తో గొడవ పడేవాడు. తనకు భూమిలో సగం వాటా కావాలని ఒత్తిడి చేయడంతో శనివారం రాత్రి రవీందర్ తమ్ముడు రాంచందర్‌ను కొట్టి మెడకు చున్నీతో బిగించి చంపేశాడు. గ్రామస్తుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.