మైక్రోసాఫ్ట్ Open AI చాట్ బాట్, Chat GPT కోసం ఇంటర్నెట్ బ్రౌజింగ్ ఫీచర్ ను ప్రారంభించింది. వినయోగదారులకు బ్రౌజ్ విత్ బింగ్ ఫీచర్(Browse With Bing ) ను తీసుకొచ్చింది. ఎంటర్ ప్రైజ్ సబ్ స్కైబర్లందరికీ ఇది అందుబాటులో ఉంది.
DALLE 3 అనేది Open AI టెక్ట్స్ టు ఇమేజ్ AI మోడల్ మూడవ పునరుద్దరణ. ఇది యూజర్ ఇచ్చిన సమాచారానికి తగ్గట్టుగా ఖచ్చితంగా, రియల్ గా ఉండే ఇమేజ్ లను అందిస్తుంది. ఇది AI రూపొందించిన కంటెంట్ కు భద్రత పరమైన వాటర్ మాస్క్, డేట్, టైమ్ తో కనిపిస్తుంది. ఇమేజ్ లో మోడరేషన్ సిస్టమ్ ద్వారా అవసరంలేని వాటిని తొలగిస్తుంది. టెక్ట్స్ , ఇమేజ్ లను కలపడంలో AI చర్యలను మరింత మెరుగు పర్చడమే కాకుండా క్లిష్టమైన సేఫ్టీ ఫీచర్లను కూడా అందిస్తోంది.
Bing తో బ్రౌజ్ చేయడం ప్రస్తుతం Chat GPTప్లస్, ఎంటర్ ప్రైజ్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. అయితే దీనిని భవిష్యత్ లో అందరికీ అందించాలని Open AI యోచిస్తోంది. ఈ ఫీచర్ ని వినియోగించడానికి Chat GPT యాప్ సెట్టింగ్లకు వెళ్లాలి. New Feature పై నొక్కి Browse with Bing ఎంచుకోవాలి. తర్వాత మోడల్ సెలక్టర్ నుంచి GPT4 ని ఎంచుకొని బ్రౌజ్ విత్ బింగ్ ను నొక్కాలి.
బ్రౌజ్ విత్ బింగ్ ద్వారా రియల్ టైమ్ ఇన్ ఫర్ మేషన్ ను వెతకే సామర్థ్యంతోపాటు Open AI తాజా వెర్షన్ టెక్ట్స్ టు ఇమేజ్ జనరేటర్ DALLE 3ని కూడా అందిస్తోంది. దీని ద్వారా యాప్ నుంచి బయటికి వెళ్లకుండానే నేరుగా ChatGPTలో ఇమేజ్ లను రూపొంచవచ్చు.
బ్రౌజ్ విత్ బింగ్ లా కాకుండా DALLE 3 ఇంటిగ్రేషన్ ఇప్పటికీ బీటా దశలోనే ఉంది. కాబట్టి మీరు ఊహించని ఫలితాలు రావొచ్చు. బ్రౌజ్ విత్ బింగ్ మాదిరిగానే యాప్ లోని GPT 4 ట్యాబ్ నుంచి DALLE 3మారవచ్చు.