కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ కుటుంబాలు

కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ కుటుంబాలు

వైరా, వెలుగు : ఖమ్మం జిల్లా  వైరా మున్సిపాలిటీలోని 9వ వార్డు బ్రాహ్మణపల్లి బీఆర్ఎస్ కు  చెందిన 15 కుటుంబాలు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఆధ్వర్యంలో సోమవారం కాంగ్రెస్ లో   చేరారు.  ఎమ్మెల్యే వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్   అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సీఎం రేవంత్ రెడ్డి మీద అభిమానంతో ఈ  పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.

పార్టీ లోచేరిన వారిలో కన్నెగంటి వెంకటేశ్వర్లు, పాపగంటి వెంకటేశ్వర్లు, నిమ్మకాయల కిరణ్, కందుల ఓబయ్య, కన్నెగంటి విలయమ్స్, తడికమళ్ళ ముఖేష్, కోట నవీన్, మోదుగు విజయ్, కోట అరవింద్, బుడికి శీను, ముదిగొండ వెంకటనారాయణ, దిభిందల శీను కుటుంబాలు చెందినవారు కాంగ్రెస్ పార్టీలో చేరారు.