
మంచిర్యాల జిల్లా చెన్నూరు కాంగ్రెస్ ర్యాలీలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి భారీ మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. వివేక్ వెంకటస్వామి విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. భీమారం మండలంలోని బూరుగుపల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలపై కర్రలతో దాడి చేశారు. కాంగ్రెస్ కార్యకర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
చెన్నూరులో బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ పై వివేక్ వెంకటస్వామి 37515 ఓట్ల మెజారిటీతో భారీ విజయం సాధించారు. వివేక్ వెంకటస్వామికి 87541 ఓట్లు పోలవ్వగా.. బాల్కసుమన్ కు 50 వేల 26 ఓట్లు పోలయ్యాయి.