
తల్లాడ వెలుగు: బీఆర్ఎస్ నుంచి పలువురు కార్యకర్తలు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తల్లాడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కాపా సుధాకర్ వారికి కాంగ్రెస్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టే పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ లో చేరినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయల రాము, తుమ్మలపల్లి రమేశ్, యూత్ కాంగ్రెస్ నాయకులు ముస్తఫా, యాకుబ్ పాషా, నన్నేసా, షబ్బీర్ షాష ఉన్నారు.