ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో హల్ చల్

నిజామాబాద్ జిల్లా బోధన్ లో బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ ఆమేర్ ఓటమితో ఆ పార్టీ కార్యకర్తలు హల్ చల్ చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఉన్న ఫర్నిచర్ ను లారీలో నిన్న(డిసెంబర్ 4) తరలించారు. గదుల్లోని ఏసీలు, ట్యూబ్ లైట్లు, వివిధ సామాగ్రిని కూడా ధ్వంసం చేశారని కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు పాషా మోయినోద్దీన్, కౌన్సిలర్ తూము శరత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఖర్చుతో నిర్మించిన ఆఫీస్ లో గుండాళ్ల వ్యవహరించారని, షకీల్ ఓటమిని జీర్ణించుకోలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వాపోయారు.

బోధన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దాదాపు రూ. 10 లక్షల విలువగల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి.. విలువగల వస్తువులను చోరీ చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే, కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.