బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటికెళ్లిన అరెకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలంటూ సీపీ కార్యాలయం బీఆర్‌ఎస్ నేతలుఎదుట నానా హడావుడి చేసిన విషయం తెలిసిందే. ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి సహా మరికొందరు బీఆర్‌ఎస్ నాయకులను అదపులోకి తీసుకున్నారు. వీరిని వాహనాల్లో కేశంపేట పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా బిఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.
అరెస్ట్ చేసిన నేతలను కేశంపేట పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్న సమాచారాన్ని ముందే తెలుసుకున్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు కేశంపేట మండలం కొత్తపేటలో అడ్డుకున్నారు. రోడ్డుపై రాళ్లు, వాహనాలు అడ్డుపెట్టి వాహనాన్ని ముందుకు వెళ్లకుండా అడ్డుపడ్డారు. దాంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.