కమలాపూర్, వెలుగు: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నూరు, వంగపల్లి, గూడూరు, కొత్తపల్లి గ్రామాల నుంచి 300 మంది బీఆర్ఎస్, బీజేపీ నాయకులు హుజరాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో సోమవారం కాంగ్రెస్ లో చేరారు.
ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం మండల అధ్యక్షుడు పుల్లూరు శ్రీనివాస రావు, మాజీ ఎంపీటీసీ కొలిపాక సాంబయ్య, కొత్తపల్లి మాజీ సర్పంచ్ బండారు సంపత్, మాజీ ఉప సర్పంచ్ కుమ్మరి బాబు, పాక చంద్రమౌళి, నేరెళ్ల చంద్రమౌళి, నర్మెట్ట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.