దుబారా కాదు.. సంక్షేమమే.. అసెంబ్లీలో లెక్కలతో సహా డిప్యూటీ సీఎం భట్టి వివరణ

దుబారా కాదు.. సంక్షేమమే.. అసెంబ్లీలో లెక్కలతో సహా డిప్యూటీ సీఎం భట్టి వివరణ

హైదరాబాద్: తెలంగాణలో అప్పులపై అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య షార్ట్ డిస్కషన్ జరిగింది. అప్పులపై జరిగిన ఈ చర్చలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలుప్రతివిమర్శలతో అసెంబ్లీలో కాక రేపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక డబ్బులన్నీ దుబారాగా ఖర్చు చేస్తున్నారని బీఆర్ఎస్ విమర్శించింది. బీఆర్ఎస్ చేసిన ఈ విమర్శలకు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. డబ్బులన్నీ దుబారా అని విమర్శిస్తున్నారని, అధికారంలోకి వచ్చిన వెంటనే శ్వేతపత్రం విడుదల చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తుచేశారు.

ALSO READ | రాష్ట్రంలో మొత్తం అప్పులు 6 లక్షల 71 వేల కోట్లు : డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క

అప్పులపై మాజీ మంత్రి అనేక ఆరోపణలు చేశారని, ఆర్బీఐ రిపోర్టును చూపిస్తూ సభను పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. మహాలక్ష్మీ స్కీంతో ఆర్టీసీని గాడిలో పెట్టామని, బీఆర్ఎస్ చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ పథకాలు అమలు చేస్తున్నామని భట్టి చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ ఏఏ సంక్షేమ పథకాలపై ఎంత ఖర్చు చేశారో ఆయన వివరించారు.

దుబారా కాదు.. సంక్షేమమే.. డిప్యూటీ సీఎం భట్టి చెప్పిన లెక్కలివి:
* పంటల బీమాపై రూ.1514 కోట్లు
* ఫ్రీ బస్సు స్కీంపై రూ.1375 కోట్లు
*  కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కోసం రూ.2311 కోట్లు
* గ్యాస్ సిలిండర్ సబ్సిడీకి రూ.442 కోట్లు
* రుణమాఫీకి రూ.20,600 కోట్లు 
* 200 యూనిట్ల ఫ్రీ కరెంటుకు రూ.1234 కోట్లు
* సాగు రంగంపై రూ.11,140 కోట్లు
* రాజీవ్ ఆరోగ్యశ్రీకి రూ.800 కోట్లు