- బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్
కరీంనగర్ సిటీ, వెలుగు : కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పనైపోయిందని, ఆ పార్టీ దుకాణం ఖాళీ అవుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని తిమ్మాపూర్, కథలాపూర్, బెజ్జంకి, గంగాధర మండలాలతోపాటు కరీంనగర్ లోని 36, 57, 38, 17వ డివిజన్లకు చెందిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కు చెందిన వందలాది మంది నాయకులు బుధవారం ఎంపీ ఆఫీసులో సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. వాటిని అమలు చేయడంలో ఘోరంగా ఫెయిల్ అయిందన్నారు. పార్టీలో చేరినవారిలో పాశం వెంకటేశ్, అన్నాడి రమణారెడ్డి, పాశం అనిల్, పాశం సాయి చంద్, సాయి, రంజిత్, రాజు, ప్రశాంత్, కీసర చందు, ఎం. అమర్, తదితరులు బీజేపీలో ఉన్నారు.