-
బీఆర్ఎస్, కాంగ్రెస్ విలీనం ఖాయం
-
అందుకే రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయలే
-
గడీల బద్దలు కొట్టిన చరిత్ర బీజేపీదే
హైదరాబాద్: బీఆర్ఎస్, కాంగ్రెస్ విలీనం ఖాయమని, త్వరలోనే అమెరికాలో అప్పగింతలు కాబోతున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. అందుకే 38 మంది ఎమ్మెల్యేలున్నా బీఆర్ఎస్ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయకుండ పరోక్షంగా కాంగ్రెస్ కు సపోర్ట్ చేసిందని చెప్పారు. బీజేపీ కవితకు బెయిల్ ఇప్పించిందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోందని, సుప్రీంకోర్టుకు, బీజేపీకి ఏం సంబంధమని బండి ప్రశ్నించారు.
సుప్రీంకోర్టును ధిక్కరించేలా కాంగ్రెస్ వ్యాఖ్యలున్నాయి. అందుకే కోర్టు హెచ్చరించిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంతో తమ పార్టీ కార్యకర్తలు కొట్లాడితేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, గడీల బద్దలు కొట్టిన చరిత్ర బీజేపీదేనని బండి సంజయ్ అన్నారు. బీజేపీ కుటుంబ, అవినీతి పాలనకు వ్యతిరేకమని ఎట్టి పరిస్థితిలోనూ బీఆర్ఎస్ తో కలువబోదని చెప్పారు.