లాస్ట్ లిస్ట్ రిలీజ్ చేసిన బీఆర్ఎస్.. హైదరాబాద్ నుంచి పోటీ చేసేది ఆయనే..

లోక్ సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. తెలంగాణలోని 17 స్థానాలకు గాను అభ్యర్థులను ప్రకటించింది. గత వారం రోజుల నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గురించి కసరత్తు చేస్తున్న బీఆర్ఎస్ నేడు ఆకరి అభ్యర్థని ప్రకటించారు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు గడ్డం శ్రీనివాస్ యాదవ్ కు అవకాశం కల్పించారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. 

గడ్డం శ్రీనివాస్ యాదవ్ విద్యావేత్త. ఆయనకు పలు కాలేజీలు, స్కూల్స్ ఉన్నాయ్. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. చివరకు నేడు హైదరాబాద్ ఎంపీ టికెట్ ను తెచ్చుకున్నారు.

బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు వీరే.. 

హైదరాబాద్‌: గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ 
జ‌హీరాబాద్: గాలి అనిల్ కుమార్,
ఖ‌మ్మం: నామా నాగేశ్వర్ రావు,
క‌రీంన‌గ‌ర్: వినోద్ కుమార్,
పెద్దప‌ల్లి: కొప్పుల ఈశ్వర్,
మ‌హ‌బూబాబాద్ : మాలోత్ క‌విత‌,
మ‌ల్కాజ్‌గిరి : రాగిడి ల‌క్ష్మారెడ్డి,
చేవెళ్ల : కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్,
ఆదిలాబాద్: ఆత్రం స‌క్కు,
నిజామాబాద్ : బాజిరెడ్డి గోవ‌ర్ధన్,
వ‌రంగ‌ల్ :  క‌డియం కావ్య బరి. 
నాగర్‌కర్నూల్‌: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌,
మెదక్‌: వెంకట్రామిరెడ్డి,
మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ : మ‌న్నె శ్రీనివాస్ రెడ్డి,
నల్లగొండ : కంచర్ల కృష్ణా రెడ్డి
భువనగిరి : క్యామ మల్లేష్ 
సికింద్రాబాద్ : పద్మారావు గౌడ్