సాయన్న కుటుంబానికే మరోసారి కంటోన్మెంట్ టికెట్!

 సాయన్న కుటుంబానికే మరోసారి కంటోన్మెంట్ టికెట్!

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికపై ఫోకస్ చేసిన కేసీఆర్ .. మరోసారి దివగంత మాజీ ఎమ్మెల్యే సాయన్న కుటుంబానికే టికెట్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది.  అభ్యర్థి ఎంపికపై ఇవ్వాళ కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో సమీక్ష నిర్వహించారు.  ఈ సమావేశంలో కేటీఆర్, హారీశ్‌రావు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి లక్ష్మారెడ్డి, దివంగత ఎమ్మెల్యే లాస్యనందిత కుటుంబసభ్యులు సహా పలువురు పాల్గొన్నారు. 

ఈ  సమీక్షలో  సాయన్న రెండో కూతురు, దివంగత ఎమ్మెల్యే లాస్యనందిత చెల్లెలు నివేదితకు టికెట్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. మరో రెండు మూడు రోజుల్లో అభ్యర్థిపై కేసీఆర్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.  

దివంగత ఎమ్మెల్యే లాస్యనందిత  ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందండంతో  ఇక్కడ బైపోల్ అనివార్యమైంది.  మే 13న  పోలింగ్ జరగనుంది.  జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.   ఇక ఇప్పటికే కాంగ్రెస్ తమ అభ్యర్థిగా శ్రీగణేశ్ పేరును ప్రకటించగా.. బీజేపీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.