బీఆర్‌ఎస్‌ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌‎పై కేసు

బీఆర్‌ఎస్‌ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌‎పై కేసు

హైదరాబాద్: బీఆర్‌ఎస్‌ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌పై కేసు నమోదు అయ్యింది. చంద్రశేఖర్ రూ.29 కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశాడని తిరుమలరావు అనే వ్యక్తి హైదరాబాద్ సీసీఎస్‎లో ఫిర్యాదు చేశాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే బౌన్సర్లతో దాడి చేయించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తిరమలరావు కంప్లైంట్ మేరకు సీసీఎస్ పోలీసులు చంద్రశేఖర్‎పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

కాగా, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించిన కేసీఆర్ టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‎గా మార్చిన విషయం తెలిసిందే. నేషనల్ పాలిటిక్స్‎లో భాగంగా బీఆర్ఎస్ పార్టీని వివిధ రాష్ట్రాల్లో విస్తరించేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగానే తెలంగాణ పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‎లో బీఆర్ఎస్ విస్తరణపై ఫోకస్ పెట్టిన కేసీఆర్.. తోట చంద్రశేఖర్‎ను పార్టీలో చేర్చుకుని ఆయనకు ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు అప్పజెప్పారు. అయితే, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించిన కేసీఆర్ సొంత రాష్ట్రంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. గత ఏడాది నవంబర్‎లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. సొంత రాష్ట్రంలోనే షాక్ తగలడంతో బీఆర్ఎస్ పార్టీ విస్తరణ, కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్‎కి బ్రేక్‏లు పడ్డాయి.