- బీఆర్ఎస్ బీసీ నేతల డిమాండ్
హైదరాబాద్, వెలుగు: కామారెడ్డి డిక్లరేషన్ ను నవంబర్ 10లోగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ బీసీ నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు కులగణన చేపట్టాలని, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఈమేరకు శనివారం తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ బీసీ ముఖ్య నాయకుల సమావేశంలో తీర్మానించారు. తమిళనాడు, కేరళలో అమలు చేస్తున్న రిజర్వేషన్ల విధానం అధ్యయనానికి.. అదేవిధంగా తమిళనాడు ప్రభుత్వ చిత్తశుద్ధితో బీసీలకు సమకూరుతున్న ప్రయోజనాలపై అధ్యయన నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని నిర్ణయించారు. సమావేశంలో మధుసూదనాచారి, బండ ప్రకాశ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.