ఆ ఫేక్​ లెటర్ వెనక బీఆర్ఎస్: సైబర్ క్రైమ్, డీజీపీ, హైడ్రాకు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫిర్యాదు

ఆ ఫేక్​ లెటర్ వెనక బీఆర్ఎస్: సైబర్ క్రైమ్, డీజీపీ, హైడ్రాకు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫిర్యాదు

బషీర్​బాగ్, వెలుగు: తాను వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపిస్తూ అమీన్ పూర్ సంక్షేమ సంఘం సీఎం రేవంత్​రెడ్డికి ఫిర్యాదు చేసినట్టు సోషల్ మీడియాలో ఓ లెటర్​వైరల్​అవుతోందని ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీమ్ తెలిపారు. తనపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఇదంతా చేస్తున్నవారిపై యాక్షన్​తీసుకోవాలని డీజీపీ, హైడ్రా కమిషనర్, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫహీమ్ ఫిర్యాదు చేశారు. ముందుగా బషీర్​బాగ్​లోని సైబర్ క్రైమ్ కు వెళ్లిన ఆయన ఫేక్​ లెటర్​ వెనక బీఆర్ఎస్​ లీడర్ల హస్తం ఉందని ఫిర్యాదు చేశారు. తర్వాత డీజీపీ ఆఫీసుకు వెళ్లి కంప్లయింట్​ఇచ్చారు. హైడ్రా కమిషనర్ కు కంప్లయింట్​ఇచ్చారు.