యాప‌‌ల్ గూడ గ్రామంలో కాంగ్రెస్​లోకి భారీగా చేరికలు

యాప‌‌ల్ గూడ గ్రామంలో కాంగ్రెస్​లోకి భారీగా చేరికలు

ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆదిలాబాద్ రూరల్ మండలం యాప‌‌ల్ గూడ గ్రామంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్​లోకి భారీగా చేరికలు జరిగాయి. జిల్లా చేనేత సంఘం అధ్యక్షుడు అల్చెట్టి నాగ‌‌న్న ఆధ్వర్యంలో స్థానికులు, యశ్వంత్ గూడ, మత్తడి గూడ, కొత్త గూడ, రాముల గూడ గ్రామస్తులతో పాటు బీఆర్ఎస్, బీజేపీల నుంచి 500లకు పైగా మంది కార్యక‌‌ర్తలు కాంగ్రెస్​లో చేరారు. 

చీఫ్​ గెస్ట్​లుగా హాజరైన రాష్ట్ర గిరిజ‌‌న కార్పొరేష‌‌న్ చైర్మన్ కోట్నాక తిరుప‌‌తి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​చార్జ్​ కంది శ్రీనివాసరెడ్డి హాజరై వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, లోక ప్రవీణ్ రెడ్డి, షేక్ ఖలీద్, బి.రమేశ్, బి.శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.