ఐటీ కంపెనీల ఏర్పాటుకు కృషి చేస్తా : బడే నాగజ్యోతి

ములుగు (గోవిందరావుపేట), వెలుగు : ములుగులో ఐటీ కంపెనీలు, ఫుడ్‌‌‌‌ ప్రాసెసింగ్‌‌‌‌ జోన్‌‌‌‌ ఏర్పాటుకు కృషి చేస్తానని బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ బడే నాగజ్యోతి హామీ ఇచ్చారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో గురువారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే 20 ఏళ్లుగా ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు. గొత్తికోయల జీవన విధానంపై సోషల్​ మీడియాలో ప్రచారం చేస్తూ వివిధ సంస్థల నుంచి నిధులు పొందారని ఆరోపించారు.

ఎన్నికల్లో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధికి అడ్డుగా మారిన కాంగ్రెస్‌‌‌‌కు బుద్ధి చెప్పాలని సూచించారు. అనంతరం గాంధీనగర్‌‌‌‌కు చెందిన పలువురు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరారు. కార్యక్రమంలో మాజీ మంత్రి చందూలాల్‌‌‌‌ కొడుకు అజ్మీర ధరంసింగ్‌‌‌‌, గోవిందరావుపేట ఇన్‌‌‌‌చార్జి సాంబారి సమ్మారావు, జడ్పీటీసీ తుమ్మల హరిబాబు, ఎంపీపీ శ్రీనివాస్‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు. ములుగు మండలం మల్లంపల్లిలో దివంగత జడ్పీ చైర్మన్‌‌‌‌ కుసుమ జగదీశ్‌‌‌‌ తల్లిదండ్రులతో కలిసి రెడ్కో చైర్మన్‌‌‌‌ సతీశ్‌‌‌‌రెడ్డి ప్రచారం చేశారు.