ఒక్క ఛాన్స్‌‌ ఇవ్వండి: బడే నాగజ్యోతి

ఏటూరునాగారం, వెలుగు : ములుగు ఎమ్మెల్యేగా తనకు ఒక్క ఛాన్స్‌‌ ఇవ్వాలని బీఆర్‌‌ఎస్‌‌ క్యాండిడేట్‌‌ బడే నాగజ్యోతి కోరారు. జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు, మండల అధ్యక్షుడు గడదాసు సునీల్‌‌కుమార్‌‌తో కలిసి బుధవారం ములుగు జిల్లా ఏటూరు నాగారంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్‌‌ఎస్‌‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. 

యాభై ఏళ్లలో కాంగ్రెస్‌‌ చేయలేని అభివృద్ధిని తొమ్మిదేళ్లలోనే బీఆర్‌‌ఎస్‌‌ చేసి చూపించిందన్నారు. తనను గెలిపిస్తే ములుగు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్‌‌ మెంబర్‌‌ ఎండీ.వలియాబీ సలీం, ఎంపీపీ అంతటి విజయ, నాయకులు తుమ్మ మల్లారెడ్డి, కాకులమర్రి పత్రిబాబు, తాడూరి రఘు, వలీ బాబా పాల్గొన్నారు.