కామేపల్లి, వెలుగు : నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, తనను మరోసారి గెలిపించాలని ఇల్లందు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థిని భానోత్ హరిప్రియ ప్రజలను కోరారు. శుక్రవారం మండలంలోని కొత్త లింగాల గోవింద్రాల, పొన్నెకల్లు, బర్లాగూడెం, గరుడేపల్లిలో ఆమె ప్రచారం చేశారు. మండలంలో రూ.కోట్లతో బీటీ, సీసీరోడ్లు వేసినట్లు తెలిపారు.
టేకులపల్లి మండలం తన సొంత గ్రామం అయితే రాజకీయంగా కామేపల్లి పుట్టినిల్లు అన్నారు. ఎంపీపీ బానోత్ సునీత, సర్పంచులు బొడ్డు కాంతమ్మ, భానోత్ రవి, మూడు రాధ, ఎంపీటీసీ సభ్యులు గుగులోత్ సునీత, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంతోని అచ్చయ్య, కోట మైసమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ శ్రీనివాసరావు ఉన్నారు.