
- బీఆర్ఎస్సంగారెడ్డి అభ్యర్థి చింతా ప్రభాకర్
కంది, వెలుగు : పని చేసే నాయకుడికే ఓటు వేయాలని బీఆర్ఎస్సంగారెడ్డి అభ్యర్థి చింతా ప్రభాకర్ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన మండలంలోని ఉత్తర్ పల్లి, అల్లూరు, కాశీపూర్, కలివేముల, చెర్లగూడెం, తోపుగొండ, జుల్కల్ ఎద్ధుమైలారం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు చింతాకు మంగళహారతులతో, డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వానికి, ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు తీర్చే నాయకుడికే ఓటు వేయాలన్నారు.
బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజలకు చదివి వివరించారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే 16 హామీలను కచ్చితంగా అమలు చేస్తానన్నారు. గత ఎన్నికల్లో ఓడనా ప్రజల మధ్యే ఉంటూ అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేశానన్నారు. గెలిచి తప్పించుకుని తిరిగే నాయకులకు ఓట్లు వేసి మోసపోవద్దని సూచించారు. కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
భర్త గెలుపు కోసం భార్య ఇంటింటి ప్రచారం
చింతా ప్రభాకర్గెలుపు కోసం ఆయన భార్య చింతా అరుణ మున్సిపాలిటీలోని 35వ వార్డులో కౌన్సిలర్ వాణితో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. ప్రతి మహిళకు బొట్టు పెట్టి ఓటును అభ్యర్థించారు. ఎప్పుడూ ప్రజా సేవకోసమే ఆరాటపడే వ్యక్తికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఓట్లప్పుడే వచ్చే నాయకులను అస్సలు నమ్మొద్దన్నారు.