ఏపీలో బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్

2024 ఎన్నికలు సమీపిస్తన్న సమయంలో ఏపీలో రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న పార్టీల మధ్యనే హోరాహోరీ పోరుతో రణరంగాన్ని తలపిస్తోంటే స్క్రీన్ మీదకు కొత్తగా బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ నాయకుడు కొణిజేటి ఆదినారాయణ ఇండిపెండెంట్ అబ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. 

బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అందుబాటులో లేకపోవటంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశానని ఆయన అన్నారు. త్వరలోనే కేసీఆర్ ను కలిసి బీ ఫారం తీసుకుంటానని అన్నారు ఆదినారాయణ. తెలంగాణ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ ఏపీని అయిపోయిందని అందరూ అనుకుంటున్నారని, పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించి సత్తా చాటుతుందని అన్నారు. ప్రస్తుతం అప్పుల్లో కూరుకుపోయిన ఏపీని కాపాడగలిగేది కేసీఆర్ ఒక్కడే అని, ఆయన అవసరం ఏపీకి చాలా ఉందని అన్నారు ఆదినారాయణ.