- అర్బన్ రోడ్‌షోలో బీఆర్ఎస్ అభ్యర్థి గణేశ్‌గుప్తా
నిజామాబాద్, వెలుగు : రెండుసార్లు గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా అభివృద్ధి చేశానని అర్బన్ బీఆర్ఎస్అభ్యర్థి గణేశ్‌గుప్తా పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఆయన నగరంలో రోడ్‌షో నిర్వహించి, కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు. 60 ఏండ్లలో ఎవరూ చేయని రీతిలో రోడ్లను విస్తరించి,సెంట్రల్ లైటింగ్ఏర్పాటు చేశానన్నారు. మినీ ట్యాంక్బండ్నిర్మాణంతో పాటు నెహ్రూ పార్క్‌ను డెవలప్చేశానన్నారు.
నగరంలో ఎనిమిది మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ఏర్పాటు చేసి, నాలుగు వేల మంది విద్యార్థులకు బోధన అందిస్తున్నామన్నారు. సిటీ మరింత అభివృద్ధి చెందాలంటే తనను మరోసారి అసెంబ్లీకి పంపాలన్నారు. రెడ్కో మాజీ చైర్మన్అలీమొద్దీన్, మాజీ డిప్యూటీ మేయర్మీర్ మజాజ్అలీ, నవీద్, ఇక్బాల్, అబ్దుల్‌ఖుద్దూస్, కరీమొద్దీన్, కమల్, ఫయాజ్, అమర్, ఇంతియాజ్పాల్గొన్నారు.