మెట్ పల్లి, వెలుగు : ఎన్నికల టైంలో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్, బీజేపీ లీడర్ల మాటలు నమ్మి మోసపోవద్దని, ప్రజల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేసే బీఆర్ఎస్ సర్కార్‌ను ఆశీర్వదించాలని కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ కోరారు. బుధవారం ఇబ్రహీంపట్నం మండలంలో ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు.
రైతులకు 3 గంటల కరెంట్ సరిపోతుందని పీసీసీ చీఫ్రేవంత్రెడ్డి అంటున్నాడని, అలాంటి నాయకుడు కావాలా, 24 గంటలు కరెంటు ఇచ్చే కేసీఆర్ కావాలా ప్రజలు ఆలోచించాలన్నారు. ప్రశాంత తెలంగాణలో బీజేపీ కులాలు, మతాల పేరుతో ప్రజల్లో చిచ్చుపెడుతోందన్నారు. అంతకుముందు మెట్‌పల్లిలో గౌడ కులస్తులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో సంజయ్పాల్గొన్నారు.
ALSO READ : తెలుగు తమ్ముళ్లను ఓటు అడిగే హక్కు నాకే ఉంది : సండ్ర వెంకటవీరయ్య
గీత కార్మికుల సమస్యలను పరిష్కరించి వారికి బీఆర్ఎస్ సర్కారు అండగా ఉంటుందనన్ఆరు. కార్యక్రమంలో ఎంపీపీ జాజాల భీమేశ్వరి, వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి, సర్పంచులు సోమ ప్రభాకర్, , హేమలత, జున్ను బాయ్, మనిష్క, లక్ష్మి పాల్గొన్నారు.