వందరోజుల్లో సమస్యలు పరిష్కరిస్తా: బీఅర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్

ఖానాపూర్,  వెలుగు:  బీఅర్ఎస్  ప్రభుత్వ  హయాంలో  జరిగిన  అభివృద్ధి , సంక్షేమ పథకాలను  చూసి ప్రజలు   ఓటు వేయాలని  ఖానాపూర్  బీఅర్ఎస్ అభ్యర్థి భూక్య జాన్సన్ నాయక్ కోరారు.  శుక్రవారం  ఖానాపూర్  మండలం బావాపూర్ (అర్), రాజురా, చందు నాయక్ తండ, సింగాపూర్,  ఎగ్బాల్ పూర్, తర్లపాడ్ , పాత తర్లపాడ్, సత్తనపల్లి, అడవి సారంగాపూర్, రామ్ రెడ్డి పల్లె, బీర్ నంది, రంగ పేట,పాత ఎల్లాపూర్, నడింపల్లి, గోసంపల్లె ,గోడల పంపు, దిలావర్ పూర్  గ్రామాల్లో  ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

అన్ని వర్గాల సంక్షేమానికి కేసీఆర్​ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.  రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు, రైతు బీమా, 24 గంటలపాటు ఉచిత విద్యుత్ అందిస్తోందని తెలిపారు.  తాను గెలిచిన తర్వాత ఖానాపూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో   సమస్యలను వందరోజుల్లో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.  బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయ కులు  ప్ర జలకు మరోసారి మోసం చేయడానికి వస్తున్నారని,  వారికి ప్రజలు తమ ఓటు ద్వారా బుద్ధి చెప్పాలన్నారు. అనంతరం ఖానాపూర్ లో మున్నూరు కాపు సంఘ నాయకులతో  జాన్సన్ నాయక్, అదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విటల్   మీటింగ్​ నిర్వహించారు.