ప్రజల వెంటే ఉంటా.. ఆపదలో ఆదుకుంటా : కె.సంజయ్

మెట్ పల్లి, వెలుగు: ‘నేను ఈ ప్రాంత బిడ్డను...ఎల్లప్పుడూ మీ  వెంటనే ఉంటా...ఆపదలో ఆదుకుంటా.. ఎవరికి ఏ కష్టమొచ్చినా దగ్గరుండి సాయం చేస్తా.. నన్ను ఆశీర్వదించండి’ అని కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ కోరారు. మంగళవారం మెట్‌‌‌‌‌‌‌‌పల్లి పట్టణంలోని రజక, మున్నూరుకాపు, కటికే సంఘాలు, మెకానిక్ యూనియన్ సభ్యులతో సమావేశమై మద్దతు కోరారు. కోరుట్ల మండలం మాదాపూర్, మోహన్ రావుపేట, గుంలాపూర్, జోగిన్ పల్లి, పైడిమడుగు గ్రామాలలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుతో కలిసి రోడ్ షో నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో  50 ఏళ్లలో జరగని అభివృద్ధి బీఆర్ఎస్ పాలనలో తొమ్మిదిన్నర ఏండ్లలో జరిగిందన్నారు. రాష్ట్రంలోనే ఎక్కువ పింఛన్లు ఇస్తున్న ఏకైక నియోజకవర్గం కోరుట్ల అన్నారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌, బీజేపీ నాయకుల తప్పుడు, మోసపు మాటలు నమ్మొద్దన్నారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. అనంతరం పార్టీలో చేరిన పలువురికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.