హుజూరాబాద్‌‌ను సిద్దిపేటలా మారుస్త : కౌశిక్‌‌రెడ్డి

కమలాపూర్, వెలుగు : తనకు ఒక్క అవకాశం ఇస్తే హుజూరాబాద్‌‌ను సిద్దిపేట మాదిరిగా అభివృద్ధిగా చేస్తానని బీఆర్‌‌ఎస్‌‌ క్యాండిడేట్‌ కౌశిక్‌‌రెడ్డి హామీ ఇచ్చారు. ఐదేళ్లలో హుజురాబాద్‌‌ని అభివృద్ధి చేయకుంటే ఓటు వేయాలని మరోసారి మీ ముందుకు రానని సవాల్‌‌ చేశారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గుండేడు, కొత్తపల్లి, కన్నూరు, భీంపల్లి గ్రామాల్లో సోమవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని పథకాలు ఒక్క తెలంగాణలోనే అమలవుతున్నాయని చెప్పారు. ఈటల రాజేందర్‌‌ను ఏడు సార్లు గెలిపిస్తే చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. కన్నూరు, భీంపల్లికి చెందిన పలువురు బీఆర్‌‌ఎస్‌‌లో చేరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కళ్యాణి, లక్ష్మణ్‌‌రావు, సర్పంచ్‌‌ లక్మణ్‌‌రావు, సాంబయ్య గౌడ్, మాజీ సర్పంచ్‌‌ తిరుపతిరావు, సత్యనారాయణరావు పాల్గొన్నారు.