రైతుల ఆనందం కోసమే కేసీఆర్ పథకాలు : మర్రి జనార్దన్ రెడ్డి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : రైతుల కళ్లల్లో ఆనందం కోసమే కేసీఆర్  పథకాలు తెచ్చారని నాగర్ కర్నూల్  బీఆర్ఎస్​ క్యాండిడేట్​ మర్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. మంగళవారం తెలకపల్లి మండలం గట్టు రవిపాకుల, గడ్డంపల్లి గ్రామాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటల సాగు కోసం కేఎల్ఐ నీటిని తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు. కేఎల్ఐ నీరు రావడంతో నియోజకవర్గానికి వలస వస్తున్నారని చెప్పారు.

పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయని తెలిపారు. రైతులు, రైతు కూలీలకు ఉపాధి పెరిగిందన్నారు. రైతు బీమా సాయాన్ని రూ.16 వేలకు పెంచుతున్నట్లు చెప్పారు. పేదలు మరణిస్తే కేసీఆర్  బీమా కింద రూ.5 లక్షల ఆర్థికసాయం వస్తుందన్నారు. కాంగ్రెస్ గ్యారంటీలకు ఎవరు గ్యారంటీ ఇస్తారని ప్రశ్నించారు. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్  రైతులకు ఉపయోగపడే పథకాలు తెచ్చారని చెప్పారు. 

ALSO READ : అందుబాటులో ఉంటా.. గెలిపించండి  .. ఖానాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్