కాంగ్రెస్, బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి : గంగుల కమలాకర్

  •     పురుమల్లకు టికెట్ ఇప్పించిందే సంజయ్
  •     మైనార్టీ ఓట్లు చీల్చి గెలిచేందుకు బండి కుట్ర 
  •     బీఆర్ఎస్ అభ్యర్థి  గంగుల 

కరీంనగర్, వెలుగు : కాంగ్రెస్‌‌‌‌, బీజేపీ అభ్యర్థులు ఇద్దరూ ఒకటేనని, వారి కుట్రలను తిప్పికొట్టాలని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. కరీంనగర్ సిటీలోని 39,57,58 డివిజన్లలో మేయర్‌‌‌‌‌‌‌‌ యాదగిరి సునీల్ రావు, బీఆర్ఎస్​నేత కొత్త జైపాల్‌‌‌‌రెడ్డితో కలిసి  మంత్రి బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ పురుమల్ల శ్రీనివాస్‌‌‌‌కు బండి సంజయే టికెట్​ఇప్పించారని. వారిద్దరూ ఒక్కటై  మైనార్టీల ఓట్లు చీల్చాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం, సిటీలో కొనసాగుతున్న ఈ అభివృద్ధి కొనసాగాలంటే కేసీఆర్‌‌‌‌ను గెలిపించుకోవాలని కోరారు.

బీజేపీ రాష్ట్రంలో ఎక్కడా గెలిచేది లేదని, ఆ పార్టీకి ఓటేసి వృథా చేసుకోవద్దని సూచించారు. బండి సంజయ్​ ఎంపీగా ఉండి కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని దుయ్యబట్టారు. పేదలందరికీ రూ.5 లక్షల సాధారణ బీమా చేయిస్తామన్నారు. సిటీ అధ్యక్షుడు హరిశంకర్, కార్పొరేటర్లు సరిత  సతీశ్‌‌‌‌, ఆర్టీఏ మెంబర్ శ్రీపతి రావు, వెంకట్, అనిల్ కుమార్, సుధీర్ రెడ్డి, శ్రీనివాసరావు, శేఖర్ రావు,శ్రీనివాస్​ కార్తీక్ పాల్గొన్నారు. 

మెడికల్ కాలేజీలో కొత్తపల్లి వాసులకే ఉద్యోగాలు.. 

కొత్తపల్లి, వెలుగు :  కొత్తపల్లిలో నిర్మించే మెడికల్ కాలేజీలో 50 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామని బీఆర్ఎస్ కరీంనగర్​ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కొత్తపల్లి పట్టణంలో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండె నొప్పి అని చెప్పి దొంగ డ్రామాలు ఆడి ఎంపీ అయిన బండి సంజయ్.. ఆ తర్వాత నాలుగున్నరేళ్లుగా పత్తా లేకుండా పోయాడన్నారు. ఎన్నికలు రాగానే ఓట్ల కోసం మళ్లీ వస్తున్నాడన్నారు. ఎన్నికల్లో కోట్ల రూపాయలు పంచుతున్న సంజయ్ ఏ వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాడో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మాయమాటలు నమ్మితే కరెంటు కోతలు తప్పవన్నారు. 

ALSO READ : బొంగురుపోతున్న గొంతులు.. పాలిపోతున్న ముఖాలు

గంగులకు మాలసంఘం మద్దతు

కరీంనగర్ టౌన్ :  బీఆర్ఎస్  ఎమ్మెల్యే అభ్యర్థిగంగుల కమలాకర్‌‌‌‌‌‌‌‌కు మాల సంఘాల జేఏసీ నేతలు మద్దతు ప్రకటించారు. బుధవారం మీసేవ ఆఫీస్ లో రాష్ట్ర మాలసంఘాల జేఏసీ కన్వీనర్ నల్లాల కనకరాజు, రాష్ట్ర జేఏసీ చైర్మన్ రాంచందర్ మీడియాతో మాట్లాడారు. గంగుల కరీంనగర్​ను అభివృద్ధి చేశారన్నారు.