
న్యూఢిల్లీ, వెలుగు : ఎట్టకేలకు ప్రజా తెలంగాణలో అమరుల స్తూపం రంగుమారింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో అమరుల స్తూపం ఏర్పాటు చేశారు. గతంలో ఈ స్తూపానికి బీఆర్ఎస్ రంగు అయిన గులాబీ కలర్ వేశారు. అయితే... తొలిసారి ఆ రంగు మారింది. పదేండ్ల అధికార ఉత్సవాల్లో భాగంగా ఢిల్లీ తెలంగాణ భవన్ లోనూ ఆవిర్భావ వేడుకలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తొలిసారి గన్ పార్క్ లోని అమరుల స్తూపానికి ఉన్న రంగును ఈ స్తూపానికి వేశారు. దీంతో ఎట్టకేలకు స్తూపం రంగు మారిందని తెలంగాణవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.