తెలంగాణలో బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్: ఎంపీ రఘునందన్ రావు

తెలంగాణలో బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్: ఎంపీ రఘునందన్ రావు

హైదరాబాద్: త్వరలో జరగనున్న మూడు స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉంటున్నట్లు పొలిటికల్ సర్కి్ల్స్‎లో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పోటీ చేయడం లేదన్న వార్తలపై బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు రియాక్ట్ అయ్యారు. మంగళవారం (జనవరి 28) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ ముఖం చాటేసిందన్నారు. 

కేసీఆర్ సొంత జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ అభ్యర్థులు లేరా అని ఆయన ప్రశ్నించారు. పదేళ్లు అధికారం  చలాయించిన బీఆర్ఎస్ టీచర్స్, గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టకపోవడం దారుణమని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ విషయంపై కేసీఆర్, యువ రాజు కేటీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

ALSO READ | ఎక్స్ పీరియం పార్క్ అద్భుతం.. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజంలో వెనుకబడ్డాం: సీఎం రేవంత్

బీఆర్ఎస్ సీనియర్ నేత  దేవీ ప్రసాద్ లాంటి వ్యక్తికి ఎందుకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వరని నిలదీశారు రఘునందన్ రావు.  అయినా.. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్, కేసీఆర్‎కు వీఆర్ఎస్ ఇచ్చారని సెటైర్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండటమే తెలంగాణలో ఆ పార్టీ పని అయిపోయిందనడానికి నిదర్శనమని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ తోక ముడవడంతో మూడు స్థానాల్లో బీజేపీ విజయం నల్లేరు మీద నడకేనని జోస్యం చెప్పారు ఎంపీ.