నలుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్

పార్లమెంట్ ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. నాలుగు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించారు. మార్చి 4వ తేదీ బీఆర్ఎస్ భవన్ లో జరిగిన భేటీ తర్వాత.. 4 స్థానాల్లో పోటీ చేసే వాళ్లను అధికారికంగా వెల్లడించారు.

కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి బి.వినోద్ కుమార్ బరిలోకి దిగుతున్నారు.పెద్దపల్లి ఎంపీ స్థానం నుంచి కొప్పుల ఈశ్వర్ పోటీ చేయనున్నారు. ఖమ్మం పార్లమెంట్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు మళ్లీ పోటీ చేయనున్నారు. మహబూబాబాద్ ఎంపీ స్థానం నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ అయిన మాలోతు కవితను మళ్లీ ఛాన్స్ ఇచ్చారు.

బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా 

  • కరీంనగర్ - బి వినోద్ కుమార్
  • పెద్దపల్లి - కొప్పుల ఈశ్వర్
  • ఖమ్మం - నామ నాగేశ్వర్ రావు
  • మహబూబాబాద్ - మాలోత్ కవిత