ఏప్రిల్ 22 నుంచి మే 10 వరకు కేసీఆర్‌ బస్సు యాత్ర

బీఆర్ఎస్​పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్​బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారైంది. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 22 నుంచి మే 10 వరకు బస్సు యాత్ర చేపట్టనున్నారు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో 3-4 అసెంబ్లీ సెగ్మెంట్​లలో రోడ్‌ షోలు నిర్వహించనున్నారు.  ఉదయం 8 నుంచి 10, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రోడ్‌షోలు ఉంటాయి. బస్సుయాత్రలు చేస్తూనే మధ్యలో  సిద్దిపేట్, వరంగల్ వంటి ప్రాంతాల్లో బహిరంగ సభల్లో కూడా పాల్గొంటారు. 

ఈ క్రమంలో కేసీఆర్ బ‌స్సు యాత్ర ప‌ర్మిష‌న్‌పై రాష్ట్ర ఎన్నిక‌ల ప్రధానాధికారి వికాస్ రాజ్‌ను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి   క‌లిశారు. యాత్రకు సంబంధించి భ‌ద్రతా చ‌ర్యలు తీసుకోవాల‌ని విజ్ఞప్తి చేశారు. యాత్రకు పోలీసుల స‌హ‌కారం అందించేలా చూడాల‌ని కోరారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ప్రభుత్వాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటలని భావిస్తోంది.