కేసీఆర్ కు హైకోర్టు ఊరట.. ఆ కేసులో విచారణపై స్టే

కేసీఆర్ కు హైకోర్టు ఊరట.. ఆ కేసులో విచారణపై స్టే

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. 2011 సంవత్సరంలో రైలు రోకో ఆందోళనలో భాగంగా నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయిస్తూ.. పిటీషన్ దాఖలు చేశారాయన. 2024, జూన్ 25వ తేదీన విచారణ చేసిన న్యాయస్థానం.. విచారణపై స్టే విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది.

2011లో తెలంగాణ ఉద్యమం సమయంలో రైల్ రోకో నిర్వహించింది అప్పటి టీఆర్ఎస్ పార్టీ. అందులో భాగంగా రైల్వే శాఖ కేసులు పెట్టింది. ఈ కేసులో కేసీఆర్ పేరు కూడా ఉంది. ఈ రైల్ రోకోలో స్వయంగా పాల్గొనలేదని.. ఇది తప్పుడు కేసు అని.. ఈ కేసును కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు కేసీఆర్. ఈ పిటీషన్ పై విచారణ చేసిన న్యాయమూర్తులు.. విచారణపై స్టే విధించారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. తదుపరి విచారణను 2024, జూలై నెల 18వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.