ఉద్యమకాలం నుంచి కలిసొచ్చిన కరీంనగర్ గడ్డ మీద నుంచే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ 2024 మార్చి 12 మంగళవారం ఎస్సారార్ కాలేజీలో కధన భేరీ పేరుతో సాయంత్రం 5 గంటలకు సభ నిర్వహించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని కేసీఆర్ పూరించనున్నారు. బీఆర్ఎస్ ఓటమి తర్వాత తొలిసారిగా కరీంనగర్‌కు కేసీఆర్ వెళ్లనున్నారు.
కరీంనగర్ లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సిగ్మెంట్లలో నుంచి లక్షమందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గం అభ్యర్థిగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈ శ్వర్ పేర్లను ఖరారు చేసిన నేపథ్యంలో తమకు కలిసొచ్చిన గడ్డ నుంచే మొదటి సభను నిర్వహించాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయించింది.